జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. తుని నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతంలో దివిస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆయన పర్యటన కొనసాగనుంది. పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గంలో అన్నవరం బయల్దేరారు. భోజనం అనంతరం అన్నవరం నుంచి ర్యాలీగా తొండంగి మండలం కొత్తపాకల చేరుకుని.. దివిస్ పరిశ్రమ బాధితుల్ని పరామర్శిస్తారు. అనంతరం దివిస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు.
రాజమహేంద్రవరం నుంచి అన్నవరం బయల్దేరిన పవన్ కల్యాణ్ - దివిస్ పరిశ్రమకు వ్యతిరేకంగా పవన్ నిరసన
తూర్పుగోదావరి జిల్లాలో పర్యటనకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అన్నవరం బయల్దేరారు. అన్నవరం నుంచి ర్యాలీగా కొత్తపాకలకు వెళ్లనున్నారు. దివిస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పవన్ పర్యటన సాగనుంది.
తూర్పు గోదావరి జిల్లాలో పవన్ పర్యటన