తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరం మండలం అంగర గ్రామానికి చెందిన రమేష్... రావులపాలెం పని నిమిత్తం వచ్చి తిరిగి వెళ్తున్నారు. జొన్నాడ గౌతమి పాత వంతెన వద్దకు వచ్చేసరికి ద్విచక్ర వాహనం లో పెట్రోలు అయిపోయింది. పెట్రోలు తీసుకురమ్మని తండ్రి ఎర్రా రాంబాబుకు ఫోన్ చేశాడు..తండ్రి పెట్రోల్ తెచ్చే లోపు వంతెనపై కూర్చొని ఉన్న రమేశ్ ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు.
కొత్త వంతెనపై నుంచి వెళ్తున్న ఆలమూరు హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ రావు... రమేశ్ పడిపోయిన సంగతి చూశాడు. నదిలో పడిన ఆ యువకుడు పక్కనే ఉన్న బ్రిడ్జి స్థంభాన్ని పట్టుకుని కొట్టుకుపోకుండా కాపాడుకున్నాడు. వెంటనే వాహనదారులను అప్రమత్తం చేశాడు కానిస్టేబుల్ ప్రభాకర్ రావు. మినీ వ్యాన్లో ఉన్న తాడును వంతెనపై నుంచి గోదావరిలోకి వేసి యువకుడిని ప్రయాణికులు అంతా కలిసి పైకి లాగారు. సురక్షితంగా పైకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని యువకుడిని ఆసుపత్రికి తరలించారు.