ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సుప్రీంలో 'పోలవరం'.. 4 వారాలకు విచారణ వాయిదా

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఒడిశా ప్రభుత్వం వేసిన ఒరిజినల్ సూట్.. సుప్రీం ధర్మాసనం ముందుకు వచ్చింది. విచారణ 4 వారాలకు వాయిదా పడింది.

polavaram

By

Published : Jul 9, 2019, 5:39 PM IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన ఒరిజనల్ సూట్ పై... విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది. ప్రాజెక్టు నిర్మాణానికి సరైన పర్యావరణ అనుమతులు లేవని... స్టాప్ వర్క్ ఆర్డర్ ను సైతం పదే పదే నిలుపుదల చేస్తున్నారని ఒడిశా ప్రభుత్వం ఈ పిటిషన్ దాఖలు చేయగా.... జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది. తమకు ఆరు వారాల గడువు కావాలంటూ ఆంధ్రప్రదేశ్ తరఫు న్యాయవాది జీఎన్ రెడ్డి కోరారు. అంత సమయం కుదరదన్న సుప్రీం.. ఇదే అంశానికి అనుబంధంగా ఉన్న మరో పిటిషన్ కు నాలుగు వారాల సమయమే ఉందని వివరించింది. అదే సమయాన్ని తీసుకోవాలని రాష్ట్ర న్యాయవాదిని ఆదేశించింది. మరోవైపు... పోలవరం ప్రాజెక్టుపై తాము వేసిన పిటిషన్ పై ప్రతివాదులు సమాధానం ఇవ్వలేదని తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపైనా నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా పడింది.

ABOUT THE AUTHOR

...view details