ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సత్యదేవుని ఆర్జిత సేవలు.. విదేశీయులకు ఆన్​లైన్​ బుకింగ్​ - updates of anavaram temple

సాంకేతికత అభివృద్ధి చెందుతున్న వేళ... అన్నింటికీ ఆన్​లైన్ మంత్రం జపిస్తున్నాం. ఇదే తరుణంలో దేవుళ్ల పూజను ఆన్​లైన్ చేస్తే... విదేశాల్లో ఉండే తెలుగు వారు తమ పేరిట ఇక్కడ స్వామివారికి పూజలు చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు అధికారులు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని ఆర్జిత సేవలు, పూజలను విదేశీయులకు అందుబాటులోకి తెచ్చేలా దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు.

online puja avaliable to annavaram sathayanarayanswamy
విదేశీయులకు అందుబాటులోకి సత్యదేవుని ఆర్జిత సేవలు, పూజలు

By

Published : Feb 3, 2020, 10:39 PM IST

విదేశీయులకు అందుబాటులోకి ఆన్​లైన్​లో సత్యదేవుని ఆర్జిత సేవలు, పూజలు

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని అర్జిత సేవలు, పూజలను విదేశాల్లో ఉండే భక్తులు చేయించుకునే విధంగా అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. పూజ చేయించుకోవాలనుకుంటున్న భక్తులు నిర్ణీత రుసుమును( భారత దేశ కరెన్సీకి సరిపడ డాలర్లు) ఆన్​లైన్ ద్వారా చెల్లిస్తే వారి పేరు మీద పూజలు నిర్వహిస్తారు. కమిషనర్ ఆదేశానుసారం తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయిస్తూ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేశారు.

ABOUT THE AUTHOR

...view details