తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన ఓ రైతు ప్రమాదవశాత్తూ గోదావరి నదిలో పడి మృతి చెందాడు. గ్రామానికి చెందిన తాడిమెల్ల వెంకటరావు అనే వృద్ధ రైతు గోదావరి వరద తగ్గిందని.. లంకలో ఉన్న పశువుల మకాం చేసేందుకు లంకలోకి వెళ్లాడు. వరద ప్రవాహంలో ప్రమాదవశాత్తూ పడి గల్లంతవ్వగా.. స్థానికులు గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. ఆ పరిసరాల్లో అతని మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఆత్రేయపురం ఎస్ ఐ నరేష్ తెలిపారు.
పశువుల మకాం చూడటానికి వెళ్లిన రైతు.. గోదావరిలో పడి మృతి
లంక ప్రాంతంలో ఉన్న పశువుల మకాం ఎలా ఉందో చూడటానికి వెళ్లిన రైతు.. ప్రమాదవశాత్తూ గోదావరి నదిలో పడి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన తూర్పు గోదావరి జిల్లా ర్యాలీలో జరిగింది.
గోదావరిలో పడి రైతు మృతి