రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వైద్య కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన వరికూటి వెంకటవేణుధరప్రసాద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్లో ఉంటున్న ప్రధాన నిందితుడు ప్రసాద్..మరో ముగ్గురితో కలిసి ముఠాగా ఏర్పడి రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో వైద్యులు రామకృష్ణంరాజుకు మాయమాటలు చెప్పి రైస్ పుల్లింగ్ యంత్రం వల్ల సిరిసంపదలు, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని 5 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించారు. మోసాపోయానని తెలుసుకున్న వైద్య కుటుంబం..ఆర్థిక ఇబ్బందులు, రుణగ్రహీతల నుంచి ఒత్తిళ్ల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు షావోలిన్, అనంతరామ్, శ్రీనివాసరావు పరారీలో ఉన్నట్లు తెలియజేశారు. వారి కోసం మూడు బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
వైద్య కుటుంబం ఆత్మహత్య కేసులో ఒకరి అరెస్టు
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో సంచలనం సృష్టించిన వైద్య కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేయగా..మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. నిందితుడు రైస్ పుల్లింగ్ పేరుతో వారిని మోసం చేసిన కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.
ఆత్మహత్య కేసులో ఒకరి అరెస్టు