నూతన గస్తీనౌక 'ప్రియదర్శిని' ప్రారంభం
అత్యాధునిక రక్షణ వ్యవస్థతో రూపొందించిన ప్రియదర్శిని గస్తీనౌక సేవలను తూర్పు ప్రాంతపు అదనపు డైరెక్టర్ జనరల్ కె.ఆర్. నౌటియాల్, తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ప్రారంభించారు. కాకినాడలోని డీప్ వాటర్ పోర్టు జెట్టి నుంచి ఇండియన్ కోస్ట్ గార్డు విభాగంలోకి నౌకను ప్రవేశపెట్టారు.
అత్యాధునిక రక్షణ వ్యవస్థతో రూపొందించిన 'ప్రియదర్శిని' గస్తీనౌక సేవలను తూర్పు ప్రాంతపు అదనపు డైరెక్టర్ జనరల్ కె.ఆర్. నౌటియాల్, తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ప్రారంభించారు. కాకినాడలోని డీప్ వాటర్ పోర్టు జెట్టి నుంచి ఇండియన్ కోస్ట్ గార్డు విభాగంలోకి నౌకను ప్రవేశపెట్టారు.
5 ఏళ్ల పాటు తీర ప్రాంతంలో గస్తీ సేవలు అందించనుందని ఈస్టర్న్ సీబోర్డు అడిషనల్ డైరెక్టర్ జనరల్ నౌటియాల్ తెలిపారు. కోస్ట్‌గార్డ్ సర్వీసులో అత్యాధునిక వేగవంతమైన గస్తీ నౌకగా దీన్ని తయారుచేయడం జరిగిందని చెప్పారు. గంటకు 34 నాటికల్ మైళ్ల వేగంతో ఈ నౌక ప్రయాణిస్తుందని చెప్పారు. ఇటీవల శ్రీలంకలో నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో తీర ప్రాంతంలో గస్తీ ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా, సైనిక దళాల అధికారులు పాల్గొన్నారు.
TAGGED:
priyadarshini