తూర్పు గోదావరి జిల్లా నియోజకవర్గ కేంద్రమైన పి.గన్నవరంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి వద్ద పలువురు గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల కోసం వచ్చిన గర్భిణులు ఏ మాత్రం సామాజిక దూరం పాటించకుండా వైద్య పరీక్షల కోసం నిరీక్షించారు.
తాము ఎంత చెబుతున్నా ఆస్పత్రికి వచ్చే రోగులు సామాజిక దూరం పాటించకుండా వ్యవహరిస్తున్నారని వైద్యులు తెలిపారు. కరోనా వ్యాప్తితో ఎవరికి వారు వ్యక్తిగతంగా దూరం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.