ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా

జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రాజీనామాకు పరిషత్ ఎన్నికలకు చంద్రబాబు దూరమని ప్రకటించడమే కారణంగా తెలుస్తోంది.

nehru-resigns
nehru-resigns

By

Published : Apr 2, 2021, 7:49 PM IST

తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట తెదేపా ఇన్‌ఛార్జ్‌గా మాత్రం కొనసాగుతానని చెప్పారు. పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించాలని పార్టీ ప్రకటించడం తనను నిరాశకు గురిచేసిందన్నారు. ఈ నేపథ్యంలోనే తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు.

జ్యోతుల నెహ్రూ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999 ఎన్నికల్లో తెదేపా తరఫున విజయం సాధించిన ఆయన.. 2014లో వైకాపా నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికల తర్వాత నెహ్రూ తెదేపాలో చేరారు. 2019 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి జ్యోతుల చంటిబాబు చేతిలో ఓటమి పాలయ్యారు.

ఇదీ చదవండి:బెజవాడలో బ్లేడ్‌ బ్యాచ్‌ అరాచకం.. రూ.100 కోసం దాడి..ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details