ఈ నెల 21 వరకు తీరంలో ఇండో-అమెరికా త్రివిధ దళాల రహస్య విన్యాసాలు జరుగుతాయి. నౌకాదళ రియర్ అడ్మిరల్ సూరజ్ భేరి, డీఎస్పీ కుమార్ పర్యవేక్షణలో వీటిని నిర్వహిస్తున్నారు.
తీరానికి సూదూరంలో విన్యాసాలు
మెకనైజ్డ్ లాంగ్ క్రాఫ్ట్‌లు, స్పీడ్ జెమిని బోట్లలో తీరానికి సుదూరంలో విన్యాసాలు సాగించాయి. ZP5177, IH236, ఛేతక్ హెలికాఫ్టర్లు ఆకాశంలో చక్కర్లు కొట్టాయి. ప్రకృతి విపత్తుల్లో భూభాగం నుంచి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించే అవకాశం లేనప్పుడు సైనికులు సముద్రమార్గం ద్వారా వచ్చి రక్షించే ప్రక్రియలను ఈ విన్యాసాల్లో నిర్వహిస్తున్నారు. విన్యాసాల్లో సైనికులకు ప్రమాదం జరిగితే సూపర్ స్పెషాల్టీ వైద్యసేవలు అందించడానికి నిపుణులైన వైద్య సిబ్బంది, పరికరాలతో సిద్దం చేసిన సందాయక్ నౌకలు తీరానికి వస్తున్నాయి.