కాపు ఉద్యమం నుంచి తప్పుకోవాలిని నిర్ణయించుకున్నట్లు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహం నుంచి ఓ లేఖను విడుదల చేశాడు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలలో తనపై కొందరు దాడులు చేయడం బాధ కలిగించిందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర కాపు జేఏసీ సభ్యులు ముద్రగడను కలిసి ఉద్యమం కొనసాగించాలిని కోరగా..తన నిర్ణయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు.
కాపు ఉద్యమం నుంచి తప్పుకొంటున్నా: ముద్రగడ - కాపు ఉద్యమం నుంచి తప్పుకొంటున్నా
కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఈ మేరకు లేఖ విడుదల చేసిన ఆయన...కాపులకు రిజర్వేషన్లు సాధించలేకపోయారని పలువురు రకరకాలుగా మాట్లాడటం తనను తీవ్ర మనస్థాపానికి గురిచేసిందన్నారు.
కాపు ఉద్యమం నుంచి తప్పుకొంటున్నా