ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రధాని మోదీకి కాపు ఉద్యమ నేత ముద్రగడ లేఖ

కాపుల రిజర్వేషన్ల అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. తెదేపా హయంలో తీర్మానం చేసిన 5 శాతం రిజర్వేషన్లను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.

ముద్రగడ

By

Published : Aug 13, 2019, 9:55 AM IST

ముద్రగడ లేఖ

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపులకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించిన 5 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని అందులో కోరారు. బ్రిటిష్ హయాంలోనే కాపులు రిజర్వేషన్లు పొందారని పేర్కొన్నారు. తరువాత కాలంలో కొందరు రాష్ట్ర ముఖ్యమంత్రులు వీటిని తొలగించారని అందులో వివరించారు. 2017లో తెదేపా ప్రభుత్వం తమ జాతికి 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తు చేశారు. దీనికి ఆమోద ముద్ర వేయాలని ముద్రగడ విజ్ఞప్తి చేశారు. కాపులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని... రిజర్వేషన్ కల్పిస్తామని హామీలు ఇస్తూ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details