ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ సాంపిల్ కలెక్షన్​ సెంటర్​ను ప్రారంభించిన ఎంపీ మార్గాని భరత్ - కొవిడ్ సాంపిల్ కలెక్షన్​ సెంటర్​ను ప్రారంభించిన ఎంపీ

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆనంద్‌నగర్‌లో కొవిడ్‌-19 శాంపిల్‌ కలెక్షన్‌ కేంద్రాన్ని ఎంపీ మార్గాని భరత్‌ ప్రారంభించారు. ఈ కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేయించుకోవటం సులభం అవుతుందని ఎంపీ తెలిపారు.

mp margani bharat inaugrates covid-19 sample collection centre at east godavari
కొవిడ్ సాంపిల్ కలెక్షన్​ సెంటర్​ను ప్రారంభించిన ఎంపీ మార్గాని భరత్

By

Published : Jun 22, 2020, 7:37 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆనంద్‌నగర్‌లో కొవిడ్‌-19 శాంపిల్‌ కలెక్షన్‌ కేంద్రాన్ని ఎంపీ మార్గాని భరత్‌ ప్రారంభించారు. ఇటువంటి కేంద్రాల వల్ల కోవిడ్‌ పరీక్షలు చేయంచుకోవడం సులభం అవుతుందని ఎంపీ అన్నారు. కొవిడ్‌ మూడో స్టేజ్‌లోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని..., మనలో మార్పు రావాలని అన్నారు.

స్వల్ప లక్షణాలు ఉన్నవారు, ఇతర ప్రభావిత రాష్ట్రాల నుంచి వచ్చినవారు ఇక్కడ పరీక్షలు చేయించుకోచ్చని కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ తెలిపారు. కేవలం 5 నిమిషాల్లో శాంపిల్‌ తీసుకునే ప్రక్రియ పూర్తవుతుందని... తక్కువ లక్షణాలు ఉంటే ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తామని తెలిపారు. వాలంటరీ టెస్టింగ్‌ కోసమే అర్భన్‌ హెల్త్‌ సెంటర్లలో కొవిడ్‌ టెస్టింగ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని కమిషనర్‌ చెప్పారు.

ఇదీ చదవండి:తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details