నియోజకవర్గ స్థాయి అధికారులతో ప్రజాప్రతినిధుల సమీక్ష - mp chintha anuradha
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అందరూ కలిసి ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలని అమలాపురం ఎంపీ అనురాధ, పీ.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు.
నియోజకవర్గ స్థాయి అధికారులతో ప్రజాప్రతినిధుల సమీక్ష
తూర్పుగోదావరి జిల్లా గన్నవరం ఎంపీపీ కార్యాలయంలో ఎంపీ చింత అనురాధ, ఎమ్మెల్యే చిట్టి బాబు అధికారులతో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి కార్యాలయంలోనూ దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫొటోలు ఉంచాలని అధికారులకు తెలిపారు. నియోజకవర్గంలోని పలు సమస్యలపై చర్చించారు.