తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వసంతవాడ గ్రామానికి చెందిన కారంకి శ్రీనుకు మండపేటకు చెందిన నవీనతో వివాహమైంది. వీరికి ఆరేళ్ల కుమారుడు రాజేష్... ఐదేళ్ల కూతురు నిత్యానందిని ఉన్నారు. చాలాకాలం అన్యోన్యంగా జీవిస్తున్న వీరిని చూసి విధికి కన్నుకుట్టిందేమో... భార్య భర్తల మధ్య కొన్ని నెలలుగా మనస్పర్థలు తలెత్తాయి. దీంతో మనస్థాపానికి గురైన నవీన... తన ఇద్దరు పిల్లలతో కలిసి లొల్లలాకుల వద్ద కాలువలోకి దూకింది. కూతురు నిత్యానందిని మృతదేహం లభ్యం కాగా... తల్లి నవీన, కుమారుడు రాజేష్ కాలువలో గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... గాలింపు చర్యలు చేపట్టి.. నవీన, రాజేష్‌ల మృతదేహాలను వెలికి తీశారు. కాలువ వద్ద తమ పిల్లల పాఠశాల బ్యాగ్ దగ్గర పలకపై ''నువ్వు చేసిన తప్పుకు నా పిల్లలు బాధపడాలి బావ... నన్ను క్షమించు'' అని రాసి పెట్టుంది.
కాలువలోకి దూకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య - ఆత్రేయపురం
ఏ కష్టమొచ్చిందో ఏమో ఆ తల్లికి... తన ఇద్దరు పిల్లలతో కలిసి కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కట్టుకున్న భర్తతో ఏర్పడిన మనస్పర్థం కారణంగా... అభం శుభం తెలియని చిన్నారులను కాలువలో తోసేసి తానూ దూకేసింది. ఈ హృదయవిదారక సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది.
ఇద్దరు పిల్లలతో సహా... తల్లి ఆత్మహత్య
Last Updated : Jun 29, 2019, 7:51 PM IST