తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని ఆత్రేయపురం, ఉచ్చిలి, వద్ధిపర్రు గ్రామాల్లో కొన్ని రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాణిజ్య పంటలు ముంపు బారిన పడి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ముంపు సమస్యను రైతులు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో సంప్రందించి ఉచ్చిలి సమీపంలోని ఆర్ అండ్ బి రోడ్డుకు గండికొట్టి, పంట పొలాల్లో నీటిని కాలువలకు మళ్ళించారు.
భవిష్యత్తులో భారీ వర్షాలు కురిసినా.. పంట పొలాలు ముంపు బారిన పడకుండా గండికొట్టిన స్థానంలో సిమెంట్ తూరలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించడంతో ఆ స్థానంలో అధికారులు తూరలు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ జరుగుతున్న పనులను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. స్లూయిజ్ నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆర్అండ్ బి, ఇరిగేషన్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.
ఇవీ చూడండి:
సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో లోకేశ్ పర్యటన