తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి రూ.5.79 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి, ఆసుపత్రి అభివృద్ధి సంఘం ఛైర్మన్ పినిపే విశ్వరూప్ వెల్లడించారు. మంత్రి అధ్యక్షతన ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశం శుక్రవారం జరిగింది. ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలపై చర్చించి ఆమోదించారు.
'అమలాపురం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి రూ.5.79 కోట్లు మంజూరు'
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. మంత్రి అధ్యక్షతన...ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆసుపత్రి నిర్వహణ, పోస్టుల భర్తీ పలు అంశాలపై చర్చించారు.
Minister pinipe viswaroop