ఏలేరు కాలువలో స్నానానికి దిగి గల్లంతైన వ్యక్తి మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన కుంచె బాసు.. శుక్రవారం సాయంత్రం నలుగురు మిత్రులతో కలిసి కిర్లంపూడి మండలం ఏలేరు కాలువ రెగ్యులేటర్ వద్ద మద్యం సేవించాడు.
ఆ మత్తులోనే కాలువలోకి దిగి స్నానం చేస్తుండగా ప్రవాహానికి పట్టు తప్పి.. గల్లంతయ్యాడు. అతని మృతదేహాన్ని ఇవాళ పోలీసులు గుర్తించారు. అయితే.. స్నేహితులే బాసును కాలువలోకి తోసేసి ఉంటారని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.