తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా జడ్జి బబిత ఆధ్వర్యంలో బుధవారం మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపునకు ఏడు మండలాల నుంచి 1500 మంది వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఏజెన్సీలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే డాక్టర్లతో పాటు రాజమహేంద్రవరం, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులకు చెందిన డాక్టర్లు.. వైద్య సిబ్బంది వచ్చిన రోగులకు వైద్య సేవలు అందించారు. దివ్యాంగులకు అవసరమైన పరికరాలను ఉచితంగా అందజేశారు.
రంపచోడవరంలో మెగ మెడికల్ క్యాంప్...1500 మందికి వైద్య సేవలు - తూర్పుగోదావరి తాజా సమాచారం
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. 1500 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దివ్యాంగులకు అవసరమైన పరికరాలను ఉచితంగా అందజేశారు.
రంపచోడవరంలో మెగ మెడికల్ క్యాంప్...1500 మందికి వైద్య సేవలు
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య, ఆర్డీవో సీనా నాయక్, తహసీల్దార్ లక్ష్మి కళ్యాణి.. శిబిరాన్ని సందర్శించి.. వైద్య సేవలను పరిశీలించారు. శిబిరానికి వచ్చిన రోగులకు ఉచితంగా మందులతో పాటు భోజన సదుపాయాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హిమబిందు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ పాల్గొన్నారు.