తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో పీజీ వైద్య విద్యార్థి ఆత్యహత్యకు యత్నించాడు. గుంటూరు జిల్లాకు చెందిన జగపతి అనే మెడికో... పురుగుల మందు సేవించి బలవన్మరణానికి ప్రయత్నించినట్లు సమాచారం. ప్రస్తుతం జీజీహెచ్ లోని కార్డియాలజీ విభాగంలో చికిత్స పొందుతున్నాడు. సూపరింటెండ్ రాఘవేంద్రరావును ఈ విషయంపై వివరణ కోరగా...గత కొద్దిరోజుల నుంచి గజపతి డిప్రెషన్ లో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి బాగానే ఉందన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాకినాడ ఆసుపత్రిలో మెడికో ఆత్మహత్యాయత్నం - suicide attempt
కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. గుంటూరు జిల్లాకు చెందిన గజపతి... కొన్ని రోజులుగా డిప్రెషన్ లో ఉంటున్నట్లు సమాచారం
'కాకినాడ ఆసుపత్రిలో మెడికో ఆత్మహత్యాయత్నం'