తూర్పు గోదావరి జిల్లా తుని పురపాలక సంఘం ఖజానా సొమ్ములో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈఆర్పీ విధానంలో ఆన్లైన్లో నమోదు చేసిన అనంతరం మూడేళ్ల పాటు లెక్కల్లో తేడాలు వచ్చినట్లు తెలుస్తోంది. అకౌంట్స్ విభాగాధికారులు గత రికార్డులను పరిశీలించగా సుమారు రూ.6.50 లక్షలు వివరాలు సక్రమంగా లేవని గుర్తించారు.
గతంలో పనిచేసిన అధికారులు, సిబ్బంది.. పన్నులు, అపరాధ రుసుములు, ట్రేడ్ లైసెన్సుల ద్వారా వచ్చిన ఆదాయంపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలుస్తోంది. ఈ వ్యవహారపై సమగ్ర నివేదిక ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశామని పురపాలక ఆర్డీ నాగరాజు వెల్లడించారు.