ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న కారణంగా లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ సడలించి... రైళ్లు నడవటం ప్రారంభమైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అనే అంశంపై తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్లో అధికారులు మాక్‌డ్రిల్ నిర్వహించారు. రైల్వే అధికారులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన మాక్‌డ్రిల్‌పై ఓ వీడియోను విడుదల చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా... ప్రయాణికులకు రక్షణ కల్పించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
'లాక్డౌన్ సడలిస్తే రైలు నిలయంలో ఇలా ఉంటుంది'
ప్రభుత్వం లాక్డౌన్ సడలించి... రైళ్లు నడిపితే రైల్వేస్టేషన్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై తుని రైలు నిలయంలో అధికారులు మాక్‌డ్రిల్ నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.
కరోనాపై తుని రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్