గుర్తు తెలియని వ్యక్తులు వినాయకుడి విగ్రహాన్ని అవిత్రం చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణం పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం... స్థానిక పిడింగొయ్యి పంచాయితీ పరిధిలోని వెంకటగిరి సరస్వతీ పాఠశాల వీధిలో ఓ ఇంటి ప్రహరీకి ఉన్న దేవుని విగ్రహాన్ని అపవిత్రం చేసి ఉండడాన్ని స్థానికులు శనివారం ఉదయాన్నే గమనించారు. వారి సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు.
వినాయకుడి విగ్రహాన్ని అపవిత్రం చేసిన దుండగులు
రాజమహేంద్రవరం గ్రామీణంలో వినాయకుడి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపవిత్రం చేశారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.
lord ganesha idol desecrated in east godavari district
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోలీసులతో ఫోన్లో మాట్లాడారు. ఘటనపై కేసు నమోదు చేసి వేగంగా దర్యాప్తు చేయాలని సూచించారు.
ఈ ఘటనలో ఆరుగురు అనిమానితులను గుర్తించి వారిపై నిఘా ఉంచినట్లు ఈస్ట్‌జోన్ డీఎస్పీ రవికుమార్ మీడియాకు వెల్లడించారు.