ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం బంద్​తో యానాం ఆదాయానికి దెబ్బ

కేంద్ర పాలిత ప్రాతం యానాంలో మద్యం షాపులు లాక్ డౌన్ కారణంగా చాలా కాలంగా మూసే ఉన్నాయి. ఈ కారణంగా.. యావత్ రాష్ట్ర ఆదాయం సంక్షోభంలో ఉందని యానాం డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా చెప్పారు.

లాక్ డౌన్ ఎఫెక్ట్ : మద్యం షాపులు మూతపడటంతో యానం ఆర్థిక పరిస్థితి డీలా
లాక్ డౌన్ ఎఫెక్ట్ : మద్యం షాపులు మూతపడటంతో యానం ఆర్థిక పరిస్థితి డీలా

By

Published : May 17, 2020, 3:33 PM IST

లాక్​ డౌన్ కారణంలో మద్యం షాపులు మూతపడి పుదుచ్చేది ఆదాయానికి గండి పడింది. యానాంలో మద్యం అమ్మకాలు అధికంగా ఉండేవని.. లాక్ డౌన్ కారణంగా ఆ ఆదాయం అంతా తగ్గిపోయిందని డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా చెప్పారు.

మూడో దశ లాక్ డౌన్ పూర్తి కావడంతో మద్యం షాపులు తెరిచేందుకు ఉన్న అవకాశాలను శివరాజ్ మీనా వ్యాపారులతో చర్చించారు. ఇటీవల సమీప జిల్లాల్లో మద్యం షాపుల వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకొని భద్రత.. భౌతిక దూరం వంటివి అమలు చేయాలన్నారు.

ఆంధ్రప్రదేశ్​లో కన్నా ఇక్కడ ధరలు భారీగా తక్కువగా ఉండడంవల్ల ఆ ప్రభావం ఏ మేరకు ఉంటుందో అంచనా వేయాలన్నారు. పుదుచ్చేరి ప్రభుత్వం ధరలు పెంచే యోచనలో ఉన్నట్లు వ్యాపార వర్గాలు తెలియజేస్తున్నాయి.

ఇవీ చదవండి:

200 కోట్లు పెట్టుబడి సాయం అందిస్తాం: గౌతమ్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details