ముంపు గ్రామాలు ఇంకా వరదనీటిలోనే ఉన్నాయి. ఇవాళ ఏడో రోజు కూడా ముంపు ప్రభావం ప్రజల్ని తీవ్ర అవస్థలకు గురిచేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండల ప్రజలు వారం రోజుల నుంచి అంధకారంలోనే ఉన్నారు. తాగునీరు, ఆహారం, నిత్యావసరాలు అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిలువ నీడ లేక చెట్టుకొకరు పుట్టకొకరుగా పరిస్థితి మారింది. ఓవైపు వర్షాలు కురుస్తుండటంతో బాధితుల కష్టాలు రెట్టింపవుతున్నాయి. సకాలంలో భోజనాలు అందడం లేదని వాపోతున్నారు. కోనసీమలోనూ గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. గడ్డిలేక పశువులు అల్లాడిపోతున్నాయి. పంటపొలాలన్నీ మునిగి రైతులు నష్టపోయారు.
వారం రోజులుగా ముంపులోనే లంక గ్రామాలు - దేవీపట్నం
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ముంపు గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. ఏడో రోజు కూడా ముంపు ప్రభావం ప్రజల్ని తీవ్ర అవస్థలకు గురిచేస్తోంది. విద్యుత్, తాగునీరు, ఆహారం, నిత్యావసరాలు అందజేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
వారం రోజులుగా లంక గ్రామాలు ముంపులోనే..