ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అత్యంత పారదర్శకంగా గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూలు - గ్రామవాలంటీర్లుక ఇంటర్వ్యూలు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలంలో గ్రామ వాలంటీర్ల ఇంటర్వూలు జరిగాయి. ఎంపీడీవో సుభాషిని పర్యవేక్షణలో ఈ ఇంటర్వ్యూలను నిర్వహించారు.

రాజమహేంద్రవరంలో జరుగుతున్న ఇంటర్వూలు

By

Published : Jul 17, 2019, 2:08 PM IST

రాజమహేంద్రవరంలో జరుగుతున్న ఇంటర్వ్యూలు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలంలో గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూలు జరిగాయి. ఎంపీడీవో సుభాషిణి పర్యవేక్షణలో ఈ ఇంటర్వ్యూలను నిర్వహించారు. గ్రామీణ మండలంలో 918 మంది గ్రామ వాలంటీర్ల అవసరం ఉండగా 2812 మంది దరఖాస్తు చేసుకున్నారని సుభాషిణి తెలిపారు. అయితే ఇంటర్వ్యూకి వచ్చిన అభ్యర్థులను అన్ని విధాల ప్రశ్నిస్తూ ప్రభుత్వ పథకాలు, సామాజిక సేవపై ఎంత మేరకు అవగాహన ఉందో తెలుసుకుంటున్నామన్నారు. అభ్యర్థి ప్రతిభను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా ఎంపిక చేస్తున్నామే తప్ప ఎటువంటి ప్రలోభాలకు లోనవడం లేదని తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు కట్టుబడి ప్రజలకు సేవ చేయగలరా? లేదా ? అన్నది ఆలోచించి అభ్యర్థిని ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ నెల 23 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని, గైర్హాజరైన వాళ్లందరికీ ఈ నెల 24న మరో అవకాశం ఇచ్చి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details