కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామిని హైకోర్టు న్యాయమూర్తులు వి. దుర్గాప్రసాద్, డీవీఎస్ సోమయాజులు దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. వారి వెంట జిల్లా న్యాయమూర్తి కళ్యాణ చక్రవర్తి, కొత్తపేట న్యాయమూర్తి కె. సత్యకుమారి ఉన్నారు. దర్శనం అనంతరం న్యాయమూర్తులకు స్వామివారి చిత్రపటాలను దేవాదాయ శాఖ సిబ్బంది అందించారు.
వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి హైకోర్టు న్యాయమూర్తులు - vadapally venkateswaraswamy
తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామిని హైకోర్టు న్యాయమూర్తులు వి. దుర్గాప్రసాద్, డీవీఎస్ సోమయాజులు దర్శించుకున్నారు.
highcourt judges visyted to vadapally venkateswaraswamy at eastgodavari district