తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో ఉదయం ఆరు గంటల నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. వర్షాలు పొలాలు దమ్ము చేసుకోవడానికి మేలు చేస్తాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి ఇతర ఉద్యాన పంటలకు వర్షం ఉపయోగపడుతుందని తెలిపారు. కుండపోత వర్షం కారణంగా దుకాణాలు తెరుచుకోలేదు.
మండపేట మండలం కేశవరంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ గనిపోతు రాజు ఆలయానికి చెందిన చెరువు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఇటీవల వరుసగా మూడు రోజులు పాటు వర్షాలు కురవటంతో నీటి ఉద్ధృతి అధికంగా ఉంది. అటుగా ప్రయాణించేవారు జాగ్రత్తగా వెళ్లాలని స్థానికులు హెచ్చరిస్తున్నారు.