ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద గోదావరి..ఆగనంటోంది!

వరద గోదావరి...ఇంకా ఉరకలెత్తుతునే ఉంది. తూర్పు గోదావరిలోని పలు ప్రాంతాలు ఇంకా..జలదిగ్బంధంలోనే ఉన్నాయి. గ్రామాల నుంచి ప్రజలు బయటకు వచ్చేందుకు నాటు పడవలు ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

heavy_floods_in_east_godavari

By

Published : Aug 10, 2019, 10:08 AM IST


గోదావరి వరద తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో ఏమాత్రం తగ్గలేదు. పది రోజులుగా గౌతమి, వశిష్ట, వైనతేయ గోదావరి నది పాయలు ప్రవహిస్తున్నాయి. కోనసీమలో జీ పెదపూడి, అప్పనపల్లి, ముక్తేశ్వరం, చాకలి పాలెం వద్ద వరద ప్రవాహం కొనసాగతూనే ఉంది. వివిధ గ్రామాల ప్రజలు బయటకు రావడానికి నానా అవస్థలు పడుతున్నారు. నాటు పడవలతో రాకపోకలు సాగిస్తున్నారు.
ధవళేశ్వరం వద్ద వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున దిగువనున్న నదీపాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. యానాం బాలయోగి వారధి వద్ద ప్రమాద స్థాయిలో వరద ప్రవహిస్తోంది. సమీపంలోని గ్రామాల్లోకి వరదనీరు రావడంతో అగ్నిమాపకశాఖ సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అంటువ్యాధులు సోకకుండా ఆరోగ్యశాఖ సిబ్బంది మందులు పంపిణీ చేస్తున్నారు.

వరద గోదావరి..ఆగనంటోంది!

ABOUT THE AUTHOR

...view details