ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు ఏలేరు రిజర్వాయర్‌లోకి చేరుతోంది. రిజర్వాయర్‌లో క్రమేపి నీటిమట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు 3000 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఎగువనుంచి ప్రాజెక్ట్‌లోకి 6000 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ లో 22 టీఏంసీల నీరు ఉంది. ప్రాజెక్ట్ సామర్ధ్యం 24 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఏలేరు రిజ్వరాయర్కు పెరిగిన నీటిమట్టం
తూర్పుగోదావరి జిల్లా ఏలేరు రిజర్వాయరులో ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు రావటంతో నీటిమట్టం పెరుగుతోంది. అధికారులు 3000 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు.
heavy floating in eleru reserviour in east godavari dst