ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సెంట్​మెంట్​నీ అమ్మేయాలని చూస్తున్నారు: జీవీ హర్షకుమార్

వైకాపా ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత జీవీ హర్షకుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శిరోముండనం బాధితుడి కేసులో నిందితులపై.. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

congress leader harsha kumar
జీవీ హర్షకుమార్

By

Published : Mar 3, 2021, 12:59 PM IST

వైకాపా ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత జీవీ హర్షకుమార్ ధ్వజం

తూర్పు గోదావరి జిల్లా శిరోముండనం బాధితుడు ప్రసాద్‌ కేసును ప్రభుత్వం నీరుగార్చేసిందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ మండిపడ్డారు. ఎవరిని రక్షించాలని ప్రభుత్వం... శిరోముండనం కేసును నీరు గార్చుతోందన్న విషయం అందరికీ తెలిసిందేనని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కేసుపై రాష్ట్రపతి ఒక అధికారిని నియమించినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏ అధికారినీ బాధితుడి వద్దకు పంపించలేదని ఆగ్రహించారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ, తెలుగుదేశం అధినేత చంద్రబాబును విమానాశ్రయంలో అడ్డుకోవడంపైనా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. స్టీల్​ప్లాంట్ అంటే ఒక సెంట్​మెంట్ అనీ.. అటువంటి దాన్ని అమ్మేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details