ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక దోపిడీపై సీబీఐ విచారణ చేపట్టాలి: గోరంట్ల - sand mining news

రాష్ట్రంలో నూతన ఇసుక విధానం పేరిట వేల కోట్లు దోచేస్తున్నారని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రోజుకు రూ.పది కోట్ల చొప్పున ఇసుక పేరుతో అక్రమంగా నగదు వసూలు చేస్తున్నారన్నారు.

gorantla
గోరంట్ల

By

Published : Jun 17, 2021, 6:39 PM IST

రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం పేరిట వేల కోట్లు దోచేస్తున్నారని.... తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. సీఎం క్యాంప్ కార్యాలయం కేంద్రంగా ఈ దోపిడీ సాగుతోందన్నారు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. జేపీ కంపెనీకి ఇసుక తవ్వకాలు అప్పగించేసి, ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.రెండు కోట్లు, రాష్ట్రంలో రోజుకు రూ.పది కోట్ల చొప్పున ఇసుకలో అక్రమంగా నగదు వసూలు చేస్తున్నారని అన్నారు. జేపీ కంపెనీ రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో పది టన్నులకి రూ,6,750 వసూలు చేస్తూ... 8 నుంచి ఎనిమిదిన్నర టన్నులు మాత్రమే ఇసుక అందిస్తోందని బుచ్చయ్య ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details