తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడుకు గోదావరి జలాలు తరలివచ్చాయి. పురషోత్తపట్నం వద్ద పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీని ద్వారా నియోజకవర్గంలో వేల ఎకరాలకు నీరందుతుంది. నీరు మెట్టకు చేరినా అండర్ పాస్ పిల్ల కాలువలు సరిగ్గా లేక నీటిని రైతులు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. ఆ కాలువలను బాగు చేయించాలనీ.. తద్వారా నీరు సరిగ్గా పారేలా చేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
తరలివచ్చిన గోదావరి జలాలు.. ఆనందంలో రైతులు
తరలివచ్చిన గోదావరి జలాలతో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గానికి 350 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.
ప్రత్తిపాడుకు గోదావరి జలాలు.. ఆనందంలో రైతులు