తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని 16 లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గురజాపులంక, లంక ఆఫ్ ఠానేలంక, అయినాపురం గ్రామాలను వరదనీరు చుట్టేసింది.
బొప్పాయి, అరటి, వంగ, మునగ, బెండ, బీర తోటలు పూర్తిగా నీట మునిగాయి. లంకలో ఉండే పశువులను అతి కష్టంమీద గట్టుకు తరలిస్తున్నారు. వరద నీటితో లంకభూములన్నీ చెరువులుగా మారిపోగా.. రైతులు ఆవేదన చెందుతున్నారు.