ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తగ్గిన వరద ఉద్ధృతి.. అయినా ముంపులోనే లంక గ్రామాలు

గోదావరి వరదల వలన తూర్పుగోదావరి జిల్లాలోని విలీన మండలాలతో పాటు దేవీపట్నం మండలంలోని 50 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వర్షాలు తగ్గినా అమావాస్య కారణంగా సముద్రంలోకి నీరు తక్కువగా వెళ్తోంది. ఇంకో 2, 3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని అధికారులు చెప్తున్నారు.

godavari floods latest updates
గోదావరి వరదలు

By

Published : Aug 19, 2020, 3:39 PM IST

గోదావరి వరదల వలన తూర్పుగోదావరి జిల్లాలోని విలీన మండలాలతో పాటు దేవీపట్నం మండలంలోనీ 50 గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. కోనసీమలోని 15 మండలాల పరిధిలోని మరో 50 లంక గ్రామాలు నీటిలో ఉన్నాయి. వర్షాలు తగ్గినా అమావాస్య కారణంగా సముద్రంలోకి నీరు తక్కువగా వెళ్తోంది. దీంతో ఆయా గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. ఇంకో 2, 3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని అధికారులు చెప్తున్నారు.

పలు గ్రామాల్లో ఇళ్లు, పొలాలు నీట మునిగాయి. తోటలు పనికిరాకుండా పోయాయని రైతులు వాపోతున్నారు. బాధిత గ్రామాల ప్రజలు భయపడవద్దని.. వారి రక్షణకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల ఇసుక బస్తాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈరోజు సాయంత్రానికి ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే అవకాశమున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details