పదిహేను రోజులు గడవకుండానే గోదావరి వరదలు మళ్లీ పెరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ లంక గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ రోజు ఉదయం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సుమారు 8 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. ఈ కారణంగా కోనసీమలోని చాకలిపాలెం వద్ద కాజ్వే వరద నీటిలో ముంపునకు గురైంది. కాజ్వే ముంపు బారిన పడటంతో దానికి అవతల ఉన్న కనకాయలంక గ్రామ ప్రజలు బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. వరద ఇంకా పెరుగుతున్న క్రమంలో ఈ కాజ్వే పూర్తిగా మునిగిపోయే అవకాశం కనిపిస్తోంది.
ఉంపొంగుతున్న గోదావరి.. ముంపు బారిన కాజ్వే - గోదావరి వరదలు
గోదావరి వరద నీటి ప్రవాహం మళ్లీ ఉద్ధృతంగా మారింది. 15 రోజులు గడవకుండానే గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది. ఫలితంగా లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సుమారు 8 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. ఈ కారణంగా కోనసీమలోని చాకలిపాలెం వద్ద కాజ్వే.. వరద నీటిలో ముంపునకు గురైంది.
godavari floods