ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తగ్గుతున్న గోదావరి... ఊపందుకున్న సహాయక చర్యలు - mud

ఉగ్రరూపం దాల్చిన గోదారి శాంతిస్తోంది. నదిలో వరద ప్రవాహం క్రమక్రమంగా తగ్గుతోంది. దీనితో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

గోదావరి

By

Published : Aug 12, 2019, 6:16 PM IST

తగ్గుతున్న గోదావరి... ఊపందుకున్న సహాయక చర్యలు

గోదావరి ప్రవాహం మరింతగా తగ్గింది. రాజమహేంద్రవరం వద్ద నది ప్రవాహం 5 లక్షల క్యూసెక్కుల కంటే తక్కువకు చేరింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గేట్లు ఎత్తి మిగులు జలాలు సముద్రంలోకి వదులుతున్నారు. మంగళవారం నాటికి వరద ప్రవాహం మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఘాట్లలో పేరుకుపోయిన చెత్త
రాజమహేంద్రవరం వద్ద గోదావరి ప్రవాహంతో ఘాట్లలో చెత్త పేరుకుపోయింది. వరద ప్రవాహంతో బురద, మట్టి వచ్చి చేరింది. ఘాట్లను శుభ్రం చేసే పనిలో నగరపాలక సిబ్బంది నిమగ్నమయ్యారు.

ఇది కూడా చదవండి.

ఊర్లన్నీ నీటిలోనే...

ABOUT THE AUTHOR

...view details