ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్నేహితుడ్ని బంధించి యువతిపై సామూహిక అత్యాచారం

తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. తన స్నేహితుడ్ని బంధించి ముగ్గురు యువకులు .. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన 15 రోజుల క్రితం జరగ్గా.. వారిలో ఓ వ్యక్తి మళ్లీ తన కోరిక తీర్చాలని, లేదంటే నగ్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించాడు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

girl raped in east godavgirl raped in east godavari districtari district
girl raped in east godavari district

By

Published : May 13, 2021, 7:19 AM IST

స్నేహితుడితో కలిసి సముద్ర తీరానికి వచ్చిన ఓ యువతిపై మద్యం మత్తులో ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(21) 15 రోజుల కిందట అల్లవరంలోని తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చింది. స్నేహితుడితో కలిసి కొమరగిరిపట్నం కడదరి ప్రాంతంలో సముద్ర తీరానికి వెళ్లింది. మద్యం తాగి అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న సీతారామపురానికి చెందిన ఇద్దరు యువకులు, సత్యనారాయణపురానికి చెందిన మరో వ్యక్తి వారి వద్దకు వచ్చి.. స్నేహితుడిని బంధించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత నగ్నంగా ఉండగా యువతి ఫొటోలు తీశారు. పది రోజుల తర్వాత వారిలో ఓ వ్యక్తి మళ్లీ తన కోరిక తీర్చాలని, లేదంటే నగ్నచిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించాడు. దాంతో బాధితురాలు బంధువులకు చెప్పడంతో వారు బుధవారం అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ప్రభాకర్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details