తూర్పు గోదావరి జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని కె.ఏనుగుపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. స్థానిక శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు సమకూర్చేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం చేపట్టినట్లు ఆయన అన్నారు. ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.
విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ - ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు
తూర్పు గోదావరి జిల్లా గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. కె.ఏనుగుపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. వైకాపా ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కృషిచేస్తోందని స్పష్టం చేశారు.
విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ