తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం తాటిపాకలో మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావుని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని బెయిల్ మీద విడుదల చేస్తుండగా.. ఆయనను కలుసుకునేందుకు అవకాశమివ్వకుండా పోలీసులు నిర్బంధించారు. వీరితో పాటు రాజోలు నియోజకవర్గంలోని రాజోలు, మల్కిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాలలో తెదేపా ముఖ్య నాయకులను గృహ నిర్బంధం చేశారు.
మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గృహ నిర్బంధం
రాజోలు మండలం తాటిపాకలో మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావుని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని కలవకుండా ఈ చర్యలు చేపట్టారు.
మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావుని గృహ నిర్బంధం చేసిన పోలీసులు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని గొల్లపల్లి ఎద్దేవా చేశారు. ప్రజలు స్వేచ్ఛగా తిరిగేందుకు లేకుండా చేస్తున్నారని అన్నారు. మనం ఎక్కడ జీవిస్తున్నామో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు.
ఇదీ చదవండీ...'బ్యాంకులను ప్రైవేటీకరించినా..సాగు రుణాలకు ఇబ్బంది లేదు'