తూర్పు గోదావరి జిల్లా తునిలో... ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా. భోజనంలో పురుగులు, గుడ్లు కుళ్ళి ఉండటంపై సిబ్బంది తీరును తప్పుబట్టారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు మంచి ఆహారం అందించే వరకు... తానే సొంత డబ్బుతో.. ఈ పాఠశాలలో అందరికీ భోజనం పెడతానని అన్నారు. విద్యార్థులకు మంచి ఆహారం అందించాలని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు.
''పిల్లలకు ఇలాంటి ఆహారం పెడతారా?'' - vip
'పిల్లలకు ఇలాంటి ఆహరం పెడతారా... ఇది మనుషులు తినేదానా... పశువులు కూడా తినవు'... అంటూ ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా... తుని ప్రభుత్వ పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
food-problems-in-schools