తూర్పు గోదావరి జిల్లా శేరుల్లంక గ్రామంలో 5 వేల జనాభా ఉంది. ఈ ప్రాంత ప్రజలకు చెందిన సారవంతమైన లంక భూములు ప్రతి ఏటా వచ్చే వరదలకు కోతకు గురవుతోంది. వందలాది ఎకరాలు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. గత ప్రభుత్వం 75 కోట్ల వ్యయంతో రెండు కిలోమీటర్ల మేర రివిట్మెంట్ పనులు చేపట్టింది.ఈ ఏడాదిలో పనులు పూర్తయ్యాయి. కానీ వారం రోజుల క్రితం ఉద్ధృతంగా వచ్చిన భారీ వరద రివిట్మెంట్ను కదిలిస్తూ.. ఏటిగట్టును దాటింది. పంటపొలాలను ముంచుతూ గ్రామంలోకి ప్రవేశించింది. వేసుకున్న పంటలు నాశనమయ్యాయి. ప్రభుత్వం తక్షణమే ఏటిగట్టును ఎత్తు చేయాలని.. లంక చుట్టూ రివిట్మెంట్ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. రాబోయే రోజుల్లో ఏడు లంక గ్రామాలు కనుమరుగయ్యేలా ఉన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
'ఈ లంక గ్రామాలు కనుమరుగయ్యేలా ఉన్నాయి.. కాపాడండి'
తూర్పు గోదావరి జిల్లా కె గంగవరం మండలానికి చెందిన శేరుల్లంక గ్రామం.. గౌతమి.. వృద్ధ గౌతమి నదీ పాయల మధ్య ఉంది. ప్రతి ఏటా.. ఇక్కడి సారవంతమైన భూములు వరద కోతకు గురవుతున్నాయి.
floods effect on east godavarivillages