గడిచిన పది, పన్నెండు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తూర్పు గోదావరి లంక గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. తమ అవసరాలకు ఉపయోగించే నాటుపడవలను సైతం అధికారులు నిషేధించటంతో.. రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి ఉధృతి మరింత పెరుగుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అయోధ్యలంక తదితర గ్రామాలలో నివాసిత ప్రాంతాలచుట్టూ నీరు చేరుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామాలలో కొన్ని ప్రాంతాలు మరింత పల్లంగా ఉండటంతో మోకాలిలోతు పైగా నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోదావరి మరింత పెరిగితే తమ బతుకులు గోదారిపాలేనని గగ్గోలు పెడుతున్నారు. లంక గ్రామాలలోని వివిధ కూరగాయల తోటలు, పచ్చిక బయళ్లు నీట మునిగాయి. పశువులకు కనీసం పశుగ్రాసం కూడా లేకపోవటంతో అల్లాడుతున్నాయి.
గోదారమ్మ కరుణించమ్మా...!
గోదావరి ఉధృతి రోజురోజుకి పెరుగుతూనే ఉంది...దీంతో ఇళ్ల చుట్టూ నీరు చేరి, నాటు పడవలు లేక, రాకపోకలు నిలిచిపోయాయి ఆ గ్రామాల్లో....భారీ వర్షాలకు లంక ప్రజలు అతలకుతలం అవుతున్నారు.
floods are in lanka villages at east godavari district