తూర్పుగోదావరి జిల్లా తుని మండలం హంసవరంలో ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. అప్పుడే ఉపాధి హామీ పనికి వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లే విషయంలో కుమార్తెను మందలించారు. ఈ కారణంగా మనస్తాపంతో తన ద్విచక్ర వాహనంపై కుమార్తె వెళ్లగా.. వెనకే మరో ద్విచక్రవాహనంపై తండ్రి వెంబడించాడు. అయితే సమీపంలోని వంతెన పైనుంచి పోలవరం కాలువలో కుమార్తె దూకడం చూశాడు తండ్రి. బిడ్డను రక్షించుకోవాలని తండ్రి కూడా కాలువలో దూకాడు. కుమార్తెను ఎలాగోలా గట్టుపైకి చేర్చాడు. కానీ నీటిలో ఉన్న తండ్రి.. అలాగే మునిగిపోయాడు. స్థానికులు మృతి చెందిన తండ్రి మృతదేహాన్ని బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను చికిత్స నిమిత్తం తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
పోలవరం కాలువలో దూకిన కుమార్తె.. బిడ్డను కాపాడి తండ్రి మృతి - పోలవరం కాలువలో దూకి తండ్రి మృతి వార్తలు
క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. తల్లిదండ్రులు మందలించారని మనస్తాపంతో పోలవరం కాలువలో దూకిన కుమార్తెను రక్షించబోయి నీటమునిగి తండ్రి మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా తుని మండలం హంసవరంలో జరిగింది.
father died while saving daughter in polavaram canal at east godavari