ఓఎన్జీసీ వ్యర్థాల వల్ల చేపలు, రొయ్యలు చనిపోతున్నాయంటూ తూర్పుగోదావరి జల్లా గోపవరంలో రైతులు నిరసన చేపట్టారు. చల్లపల్లి పంచాయతీ పరిధిలోని ఓఎన్జీసీ సైట్ నుంచి వ్యర్థ జలాలు.. పంట కాలువలోకి చేరడంతో చెరువులోని రొయ్యలు, చేపలు చనిపోతున్నాయని రైతులు నిరసన వ్యక్తం చేశారు.
అదే పంట కాలువలోని నీటిని చెరువులకు వినియోగిస్తామని అన్నారు. మూడు రోజులుగా పరిశ్రమ వ్యర్ధాలు ఈ నీటిలో కలవడంతో... చెరువులోని చేపలు రొయ్యలు చనిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.