ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నదాతను నిండా ముంచిన వర్షాలు.. వేలాది ఎకరాల్లో పంట నష్టం

తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో వాయుగుండం ప్రభావంతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ధాన్యం చేతికొచ్చే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నీటమునిగిన పంట
నీటమునిగిన పంట

By

Published : Nov 13, 2021, 1:03 PM IST

Updated : Nov 13, 2021, 4:00 PM IST

వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు పంటలు దెబ్బతిని.. రైతులు తీవ్రంగా నష్టపోయారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో సుమారు 25వేల ఎకరాల్లో వరి చేలు నీటిపాలయ్యాయి. సాగుమడి నిండా నిలిచిన నీటిలో.. నేలకొరిగిన వరిపైరు నానుతోంది.

దీంతో.. ధాన్యం చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు వరి ధాన్యం కోసి ఉంచగా.. అది తడిసి మొలకెత్తిందని కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని పంట నష్టపోయిన రైతులు కోరుతున్నారు.

ఆకాల వర్షాలతో రామచంద్రాపురం నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పరిశీలించారు. కె. గన్నవరం, కాజూలూరు, రామచంద్రాపురం మండలాల్లో పంటలను పరిశీలించిన ఆయన.. కౌలు రైతులకు న్యాయం జరిగేలా రైతులతో సమన్వయం చేసి నష్టపరిహారం అందించే విధంగా చర్యలు చేపడతామని ఆయన వివరించారు.

ఇదీ చదవండి:
ఎయిడెడ్‌ సంస్థగానే ఉంటాం: ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల

Last Updated : Nov 13, 2021, 4:00 PM IST

ABOUT THE AUTHOR

...view details