కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆరోపించారు. కొవిడ్‌పై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా తాటిపాకలోని తన నివాసంలో ఆరో రోజు దీక్ష కొనసాగించారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారికి త్వరగా ఆసుపత్రులకు తీసుకెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
'కరోనా బాధితుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది' - వైకాపా ప్రభుత్వంపై గొల్లపల్లి సూర్య రావు విమర్శల వార్తలు
కరోనా బాధితుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆరోపించారు. పాజిటివ్ వచ్చిన వారిని ఆసుపత్రులకు తరలించకుండా జాప్యం చేస్తోందని మండిపడ్డారు.
గొల్లపల్లి సూర్యరావు నిరసన