కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో ఇంజనీర్ల బృందం పర్యటించింది. ప్రతి ఏటా వరదల కారణంగా సుమారు 16 కిలోమీటర్ల యానాం గోదావరి తీర ప్రాంతం ముంపునకు గురవుతోంది. రెండు వేల కుటుంబాల వరకు నిరాశ్రయులవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రిటైనింగ్ వాల్ నిర్మించాలని పుదుచ్చేరి ఆరోగ్య మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు... అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు ఇంజినీర్ల బృందం యానాంలో పర్యటించింది.
యానాంలో ఇంజినీర్ల బృందం పర్యటన - యానాం వార్తలు
కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ఇంజినీర్ల బృందం పర్యటించింది. వరద నీరు యానాంను ముంచెత్తకుండా ఉండేందుకు చేపట్టవలసిన నిర్మాణాలపై నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నామని తెలిపింది.
యానాంలో పర్యటించిన ఇంజనీర్ల బృందం