ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చదువుతో పాటు క్రీడలనూ ప్రోత్సాహించాలి: వంగా గీత - "చదువుతో పాటు క్రీడలను ప్రోత్సాహించాలి"

కాకినాడలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పాఠశాల స్థాయి నుంచే చదువుతో పాటు క్రీడలను ప్రోత్సాహించాలని  ఎంపీ గీత ఉపాధ్యాయులకు సూచించారు.

"చదువుతో పాటు క్రీడలను ప్రోత్సాహించాలి"

By

Published : Aug 29, 2019, 7:48 PM IST

జాతీయ క్రీడా దినోత్సవం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఘనంగా నిర్వహంచారు. జేఎన్​టీయూ వద్ద కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రారంభించిన క్రీడా ర్యాలీ....జిల్లా క్రీడా మైదానం వరకు కొనసాగింది. ఎస్పీ నయీమ్ అస్మీ, కాకినాడ ఎంపీ వంగా గీత, జేఎన్​టీయూ ఉపకులపతి రామలింగేశ్వరరావు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీల్లో రాణించిన క్రీడాకారులకు పతకాలు, ప్రోత్సాహకాలు అందించారు. పాఠశాల స్థాయి నుంచే చదువుతో పాటు క్రీడలను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందని ఎంపీ గీత అన్నారు. జిల్లాలో ఐదున్నర కోట్లతో మైదానాలు అభివృద్ధి చేస్తామని ఎంపీ చెప్పారు.

"చదువుతో పాటు క్రీడలను ప్రోత్సాహించాలి"

ABOUT THE AUTHOR

...view details