తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరులో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. గ్రామానికి చెందిన మెరుపే రవీంద్రబాబు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈరోజు పొలంలోని వ్యవసాయ మోటార్లకు సంబంధించిన మరమ్మతులు చేసేందుకు స్తంభం ఎక్కాడు.
విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి
విద్యుత్ మరమ్మతు పనులు చేసేందుకు కరెంట్ స్తంభం ఎక్కిన వ్యక్తి విద్యుదాఘాతంలో మృతిచెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా వెలిచేరులో జరిగింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి
ఒక్కసారిగా స్తంభానికి విద్యుత్ ప్రసరించటంతో కరెంట్ షాక్ కొట్టి మరణించాడు. లైన్ మెన్లు చేయాల్సిన పనులను ఎలక్ట్రీషయన్తో చేయించడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి.. : హైకోర్టులో అచ్చెన్న బెయిల్ పిటిషన్.. వచ్చే వారానికి వాయిదా